Tirupati: యాంటీబయోటిక్స్ బాధ్యతగా వాడుదాం: మోహన్ బాబు వర్సిటీ

Tirupati: యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మోహన్ బాబు యూనివర్సిటీ ఫార్మసీ విద్యార్థులు ఏ.రంగంపేటలో వీధి నాటకం ప్రదర్శించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 10 Oct 2026 8:26 PM IST
Tirupati
X

Tirupati: యాంటీబయోటిక్స్ బాధ్యతగా వాడుదాం: మోహన్ బాబు వర్సిటీ

తిరుపతి: ​ప్రపంచ ఫార్మసిస్ట్ డే, జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన ఎంబీ. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విద్యార్థులు చంద్రగిరి మండలం, ఏ.రంగంపేటలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా "యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్" పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఫార్మసీ విద్యార్థులు వీధి నాటకం ప్రదర్శించారు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం, అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవుల్లో మందుల నిరోధకత పెరిగి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ నాటకం ద్వారా స్పష్టంగా వివరించారు.

యాంటీబయోటిక్స్ ను కేవలం వైద్యుల సూచన మేరకే, సరైన మోతాదులో మరియు చెప్పిన కాలవ్యవధి వరకు మాత్రమే వాడాలని విద్యార్థులు ప్రజలకు సూచించారు. బాధ్యతాయుతంగా యాంటీబయోటిక్స్ ఉపయోగించడం ద్వారానే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ను అరికట్టవచ్చని స్పష్టం చేశారు.

విద్యార్థులు ప్రదర్శించిన ఈ వీధి నాటకం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యాకల్టీ సభ్యుల సమన్వయంతో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ప్రజారోగ్యంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతటి కీలకమైనదో తెలియజేశారు.

"యాంటీబయోటిక్స్ ను బాధ్యతగా వాడుదాం - యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ను అరికడదాం" అనే ప్రధాన సందేశాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ ఫార్మసీ విద్యార్థులు ఈ సందర్భంగా ప్రజలకు అందించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI