Tirupati: స్వర్ణముఖి వాగులో MBU స్వచ్ఛత కార్యక్రమం!
Tirupati: శ్రీనివాసమంగాపురం సమీపంలోని స్వర్ణముఖి వాగులో మోహన్ బాబు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛత కార్యక్రమం; విద్యార్థుల శ్రమదానం.
Tirupati: స్వర్ణముఖి వాగులో MBU స్వచ్ఛత కార్యక్రమం!
Tirupati: శ్రీనివాసమంగాపురం సమీపంలోని స్వర్ణముఖి వాగులో నేడు గురువారం మోహన్ బాబు యూనివర్సిటీ ఆధ్వర్యంలో బృహత్తర స్వచ్ఛత కార్యక్రమం జరగనుందని రిజిస్ట్రార్ సారథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఎన్.సి.సి కేడెట్లు, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు, తిరుపతి గ్రూప్ ఎన్.సి.సి కేడెట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములు కానున్నారని ఆయన తెలిపారు.
విశ్వవిద్యాలయ యాజమాన్యం పర్యవేక్షణలో స్వర్ణముఖి వాగు పరివాహక ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని విద్యార్థులు శ్రమదానం ద్వారా తొలగించి శుభ్రం చేయనున్నారు.
ఈ స్వచ్ఛత కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ పివి రమణ గారు, తిరుపతి గ్రూప్ ఎన్.సి.సి గ్రూప్ కమాండర్ కల్నల్ ఎన్.కె. శర్మ, 29(A) బెటాలియన్ ఎన్.సి.సి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రసన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దివ్య సింగ్, మోహన్ బాబు యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ టి. దేవరాజులూ, అధ్యాపకులు , సిబ్బంది పాల్గొననున్నారు.




