Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీ – ‘ఫిజిక్స్ వాలా’ కీలక ఒప్పందం

Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీతో ఫిజిక్స్ వాలా చారిత్రాత్మక ఒప్పందం. దక్షిణ భారతదేశంలో విద్యా విప్లవం సృష్టిస్తామన్న అలఖ్ పాండే.. విద్యార్థులకు మోహన్ బాబు దిశానిర్దేశం.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 21 Sept 2026 4:57 PM IST
Tirupati
X

Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీ – ‘ఫిజిక్స్ వాలా’ కీలక ఒప్పందం

తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని, మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ 'ఫిజిక్స్ వాలా' , మోహన్ బాబు యూనివర్సిటీల మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.

ప్రో చాన్సలర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్సలర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణను అందించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.

​ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మోహన్ బాబు మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. ఒక సాధారణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ప్రారంభమైన తన జీవిత ప్రయాణం విలన్, కమెడియన్, హీరోగా సాగి, నిర్మాతగా, రాజ్యసభ సభ్యుడిగా, చివరికి ఒక విశ్వవిద్యాలయ స్థాపకుడిగా రూపాంతరం చెందడం వెనుక నిరంతర శ్రమ, అపారమైన క్రమశిక్షణ ఉన్నాయని తన అనుభవాలను పంచుకున్నారు.

విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు, సోషల్ మీడియా వంటి అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా, చదువుపై పూర్తి దృష్టి సారించి తల్లిదండ్రుల త్యాగాలను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయానికి వచ్చే ప్రతి విద్యార్థిని తన సొంత బిడ్డగా భావిస్తానని, వారు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే తనకు నిజమైన గర్వం, సంతృప్తి లభిస్తాయని ఆకాంక్షించారు. అలాగే, మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సారథి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI