Tirupati: మోహన్ బాబు వర్సిటీలో జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం

Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో 'పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత'పై మూడు రోజుల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా సింగపూర్, మైసూర్ ప్రొఫెసర్లు హాజరు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 2 Nov 2026 8:28 PM IST
Tirupati
X

Tirupati: మోహన్ బాబు వర్సిటీలో జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం

Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని పరిశోధన, ఆవిష్కరణ విభాగం ఆధ్వర్యంలో, ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో “పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత” అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

​ఈ ప్రారంభోత్సవానికి సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ నరసింహన్ సుందరరాజన్, మైసూర్ జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహానంద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజ శ్రేయస్సు, శాస్త్రీయ పురోగతికి నాణ్యమైన పరిశోధనలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

పరిశోధనలు కేవలం పత్రాల ప్రచురణకే పరిమితం కాకుండా నూతన ఆవిష్కరణలకు దోహదపడాలని, నైతిక విలువలు పాటించినప్పుడే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తమ వర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనా వసతులు అందిస్తోందని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివి రమణ, రిజిస్ట్రార్ సారథి, పరిశోధన విభాగం డీన్ ప్రొఫెసర్, కన్వీనర్ అవిరేని శ్రీనివాసులు, డిప్యూటీ డీన్ ప్రొఫెసర్, కో- కన్వీనర్ టి.వి.వి. సత్యనారాయణ పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI