Tirupati: తిరుపతి రూరల్‌లో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం!

Tirupati: తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి, పాడిపేటలలో రూ.45 లక్షలతో నిర్మించిన నూతన స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.

K VENU, TIRUPATHI RURAL
Published on: 9 Oct 2026 2:14 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి రూరల్‌లో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం!

Tirupati: తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి & పాడిపేట పంచాయతీలకు సంబంధించిన నూతన స్వర్ణ గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం. స్వర్ణ గ్రామ సచివాలయం ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే కి అర్చకులు,జిల్లా, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

సుమారు 45 లక్షల రూపాయలతో వీబి జీ రామ్ జీ పథకం ద్వారా నిర్మించిన నూతన స్వర్ణ గ్రామ సచివాలయంను అధికారులు, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా పనులు నిలిచి పోవడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే సహకారంతో పనులు పూర్తి చేసి నేడు ప్రారంభానికి నోచుకుంది. ముండ్లపూడి & పాడిపేట పంచాయతీల ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సేవలను స్వర్ణ గ్రామ సచివాలయం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు తెలిపిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL