Tirupati: తిరుపతిలో గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని!
Tirupati: తిరుపతి యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణ తరగతులను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
Tirupati: తిరుపతిలో గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని!
Tirupati: తిరుపతి యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా గ్రామీణ విలేకరుల రెండు రోజుల పునశ్చరణ శిక్షణ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సెనెట్ హాల్‌కు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని కి సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్, విలేకరులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జర్నలిస్టులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వార్తల సేకరణ, ప్రసారంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విలేకరులకు పుస్తకంతో కూడిన కిట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్. మీడియా అకాడమీ ప్రతినిధులు, విలేకరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




