Tirupati: తిరుపతి రూరల్ మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!
Tirupati: ముండ్లపూడిలో “మీ భూమి.. మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా 185 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు.
Tirupati: తిరుపతి రూరల్ మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!
Tirupati: తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి పంచాయతీలో “మీ భూమి.. మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేకు మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ముండ్లపూడి పంచాయతీలలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి 185 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజముద్రతో ముద్రించిన పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు తమ భూ హక్కులపై మరింత భరోసా కల్పిస్తాయని తెలిపారు. రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, పాస్ పుస్తకంలో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ద్వారా తమ భూమికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని రైతులకు సూచించారు.
భూమి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలతో పాటు భూమికి సంబంధించిన మ్యాప్‌ను కూడా పాస్ పుస్తకంలో ముద్రించి అందిస్తున్నట్లు రైతులకు తెలిపిన ఎమ్మెల్యే. గతంలో ఫొటోలతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన గత పాలకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ.. రైతులకు భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




