Tirupati: తుమ్మలగుంటలో పరిషత్ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే!

Tirupati: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సరళిని ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 5 Nov 2026 11:45 AM IST
Tirupati
X

Tirupati: తుమ్మలగుంటలో పరిషత్ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే!

Tirupati: చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL