Renigunta: జోరువానను లెక్కచేయకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారం!

Renigunta: రేణిగుంట మండలంలోని పలు గ్రామాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 2 Nov 2026 3:05 PM IST
Renigunta
X

Renigunta: జోరువానను లెక్కచేయకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారం!

Renigunta: జోరువానను సైతం లెక్కచేయకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండలంలోని సూరప్పకసం, విప్పనపట్టడా, వెంకట్ రెడ్డికండ్రిగ, తండ్లం తదితర గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి జి.పాల్యం తేజోవతి, ఎంపీటీసీ అభ్యర్థి యశోదమ్మకు మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని కొనసాగించిన ఎమ్మెల్యేను పలువురు ప్రజలు అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

జడ్పీటీసీ అభ్యర్థి తేజోవతికి కమలం గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థి యశోదమ్మకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదముని రెడ్డి, జి.పాల్యం రాజశేఖర్, తమిళం సుధాకర్ రెడ్డి (బాబు రెడ్డి), లోకేష్ రెడ్డి, తంబి దొరై, మురళి, కరుణ, రజిని తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA