Renigunta: రేణిగుంట మండలంలో ఉధృతంగా కూటమి ప్రచారం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటి ప్రచారం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 31 Oct 2026 11:48 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో ఉధృతంగా కూటమి ప్రచారం!

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ తరఫున జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్‌తో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA