Gudur: గూడూరులో దారుణం: రైలు నుంచి యువకుడిని తన్నిన దుండగుడు
Gudur: గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రయాణంలో జరిగిన తోపులాటలో గుర్తుతెలియని వ్యక్తి కాలితో తన్నడంతో నిఖిల్ (30) రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
Gudur: గూడూరులో దారుణం: రైలు నుంచి యువకుడిని తన్నిన దుండగుడు
గూడూరు: గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి కాలితో తన్నడంతో యువకుడు రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు.
నిఖిల్ వయసు: 30 సంవత్సరాలు.తిరుపతి నుంచి గూడూరు వెళ్లే రైలులో నిఖిల్ ప్రయాణిస్తున్నాడు. రైలు గూడూరుకు చేరుకునే సమీపంలోకి వచ్చేసరికి జనరల్ కోచ్ లో విపరీతమైన రద్దీ అందరూ గేటు దగ్గరే నిలబడి ఉన్నారు.ఈ క్రమంలోనే పక్కనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తితో చిన్నపాటి తోపులాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఒక్కసారిగా ఆ వ్యక్తి నిఖిల్ ను కాలితో బలంగా తన్నడంతో.నిఖిల్ అదుపుతప్పి వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడిపోయాడు.కింద పడటంతో కాలు రెండు చోట్ల విరిగిపోయింది, తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న నిఖిల్ ను చూసి తోటి వెంటనే రైల్వే పోలీసులకు, 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన అతన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.రద్దీగా ఉండే రైళ్లలో ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చేయవద్దని, గేటు దగ్గర నిలబడవద్దని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.




