Kanipakam: తప్పిన పెను బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం!
Kanipakam: తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లిన ఆర్టీసీ బస్సు వెనుక ఎడమ టైరుకు మూడు బోల్టులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Kanipakam: తప్పిన పెను బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం!
Tirupati: తిరుపతి నుండి ప్రతిరోజు కాణిపాకం వెళ్లే ఆర్టీసీ బస్సు పూతలపట్టు కొండేపల్లి మీదుగా కాణిపాకం చేరుకుంటుంది ఈ క్రమంలో శనివారం తిరుపతి నుండి ఉదయం 11 గంటల ప్రాంతంలో బయలుదేరిన బస్సు కాణిపాకం చేరుకున్నది.
కాణిపాకం నుండి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేర వలసిన సమయంలో బస్సు డ్రైవర్ బస్సు టైర్లను పరిశీలించగా బస్సు వెనుక ఎడమవైపున టైరుకు బిగించి ఉన్న బోల్టులు మూడు లేకపోవడంతో డ్రైవర్ నే వ్వర పోయాడు. ఏది ఏమైనా పుణ్యక్షేత్రానికి రావలసిన బస్సు క్షేమంగా కాణిపాకం చేరుకునేందుకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే తిరుపతి డిపో గ్యారేజ్ వారు బస్సు నైపుణ్యాన్ని పరీక్షించి ప్రజల ప్రయాణా సౌకర్యానికి సిద్ధం చేయవలసిన అవసరం ఉంది. అటు ఏడుకొండలస్వామి ఇటు వరసిద్ధి కానిపాకం వినాయక స్వామి ప్రయాణికులు బస్సు ప్రమాదం నుంచి కాపాడారని చెప్పాలి. డ్రైవర్ చాక చెక్యముతో కాణిపాక బస్టాండ్కు ప్రయాణికులను చేరవేశాడు .




