Tirupati: తిరుపతి రూరల్‌లో వైఎస్సార్‌సీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 మంది నేతలు
Tirupati: తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో 20 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరారు.
Tirupati: తిరుపతి రూరల్‌లో వైఎస్సార్‌సీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 మంది నేతలు
Tirupati: పేరూరు పంచాయతీలో వైసీపీకి చెందిన 20 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పేరూరు పంచాయతీలోని అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజల మద్దతుతో పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




