Renigunta: ప్రైవేట్ లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి!
Renigunta:
రేణిగుంట: మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రేణిగుంటలోని ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాడ్జి గదిలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.




