Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ!
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై దరిశనమిచ్చారు. నేటి రాత్రి చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.
Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ!
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వాహనసేవలో, సూర్యమండల మధ్యవర్తిగా వెలుగొందుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు.
ఆయురారోగ్య ప్రదాత సూర్యుడు: సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు మరియు సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నేడు రాత్రి చంద్రప్రభ వాహనసేవ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.




