Tirumala: శ్రీవారి సేవలో కొప్పెర వంశస్థుల సంప్రదాయానికి టీటీడీ ఆటంకం!
Tirumala: 1821 నుంచి తిరుమల శ్రీవారికి కొప్పెర గంగాళం, వస్త్రాలు సమర్పించే వంశపారంపర్య సంప్రదాయానికి టీటీడీ ఆటంకాలు కల్పిస్తోందని కొప్పెర సాయి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tirumala: శ్రీవారి సేవలో కొప్పెర వంశస్థుల సంప్రదాయానికి టీటీడీ ఆటంకం!
Tirumala: 1821 నుంచి తిరుమల శ్రీవారికి కొప్పెర గంగాళం, వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్న తమ వంశపారంపర్య సంప్రదాయానికి టీటీడీ అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారని కొప్పెర సాయి సురేష్, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి సమర్పించే కొప్పెర గంగాలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వారి పేర్కొన్నారు
తిరుపతి రూరల్ మండలం కొప్పెరవాండ్లపల్లె లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రతి ఏడాది సుమారు 30 నుంచి 40 మంది కుటుంబ సభ్యులతో నిర్వహించే ఈ సంప్రదాయానికి 2024 నుంచి కేవలం ఆరుగురికే అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు.
తాము ఉచిత దర్శనం కోరడం లేదని, డబ్బులు చెల్లించి దర్శనం చేసుకుంటామని తెలిపినా టీటీడీ అధికారులు అనుమతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంశపారంపర్య ఆచారాన్ని కొనసాగించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. అవసరమైతే కొప్పురవాండ్లపల్లి గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రికి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు.




