Kodur: రైల్వే కోడూరులో ప్రతిభావంతురాలైన విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహూకరణ!
Kodur: రైల్వే కోడూరు ఎస్.వి. జూనియర్ కళాశాలలో ఇంటర్ టౌన్ ఫస్ట్ సాధించిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని కిన్నెరకి రూ.55 వేల విలువైన ల్యాప్‌టాప్ బహూకరణ.
Kodur: రైల్వే కోడూరులో ప్రతిభావంతురాలైన విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహూకరణ!
Kodur: పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో HMM స్కూల్ లో చదువుకున్న పేద విద్యార్థిని పొదలకూరు కిన్నెరD/o లక్ష్మీ నారాయణ S.V JUNIOR COLLEGE MARCH 2026 ఫలితాలలో ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె బీటెక్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ (ఫ్రీ సీటు) ఇంజినీరింగ్ చదువుతోంది.
విద్యార్థినిలోని ప్రతిభను గుర్తించిన ఎస్.వి. జూనియర్ కళాశాల యాజమాన్యం ₹55,000 విలువైన లెనోవో ల్యాప్‌టాప్‌ను ఆమెకు బహూకరించి ప్రోత్సహించింది. కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ మరియు అనంతరాజుపేట స్కూల్ ఉపాధ్యాయులు కె. వెంకటరమణ విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు విద్యకు, ప్రతిభకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థినికి ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ల్యాప్‌టాప్ ఆమె బీటెక్ విద్యాభ్యాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కిన్నెర బీటెక్‌లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎస్.వి. జూనియర్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. విద్యార్థినిని అభినందించారు.




