Pellakuru: కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, కిలివేటి!

Pellakuru: తిరుపతి జిల్లా పెళ్లకూరులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2026 3:59 PM IST
Pellakuru
X

Pellakuru: కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, కిలివేటి!

Pellakuru: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి , సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య కలిసి పరామర్శించారు.

ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పై అక్రమంగా హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపడం చట్టవిరుద్ధమని అన్నారు.* కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు.

ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదని, జగన్ 2.0లో పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా సరే తమ చర్యలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అదిరేది లేదు, బెదిరేది లేదు అని స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసుల విషయంలో న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా వారికి అండగా నిలబడతామని, వారి కుటుంబాలకు కూడా పార్టీ నాయకత్వం తోడుగా ఉంటుందని తెలిపారు.

కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి తాము పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. కష్టసమయంలో నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు, పెళ్లకూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి , కిలివేటి సంజీవయ్య భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యరెడ్డి , జిల్లా కార్యదర్శి మద్దాలి సోమశేఖర్ రెడ్డి , మాజీ ఏఎంసీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి , పెళ్లకూరు మండల అధ్యక్షులు ఒబ్బు వెంకటరత్నం , నాయుడుపేట మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పాలూరు దశరథ రామిరెడ్డి , రాష్ట్ర కార్యదర్శి ఎల్లు మోహన్ , బండి బాలు , అనిల్ రెడ్డి , యూత్ అధ్యక్షులు పాలేటి నాగార్జున , సాయి రెడ్డి , సిద్ధయ్య , మీజూరు వంశీ , పెళ్లకూరు మండల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్