Chandragiri: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తొండవాడ జగనన్న కాలనీ!

Chandragiri: తిరుపతి జిల్లా తొండవాడ సమీపంలోని జగనన్న కాలనీలో మందుబాబులు, గంజాయి బ్యాచ్ వీరంగంతో ప్రజలు భయపడుతున్నారు. రాత్రి గస్తీ పెంచాలని కోరుతున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 22 Nov 2026 7:52 PM IST
Chandragiri
X

Chandragiri: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తొండవాడ జగనన్న కాలనీ!

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని ఉన్న జగనన్న కాలనీకి మంచి పేరు ఉంది. ఇక్కడ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు అత్యధికంగా ఉన్నారు. అధిక సంఖ్యలో బయట పనులకు వెళ్లి సాయంత్రం కాలనీ ఇంటికి చేరుకునే వారు ఉన్నారు. అయితే ఇంత మంచి పేరు ఉన్న జగనన్న కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే నమ్మశక్యం కాలేదు.

సాయంత్రం ఆరు అయిందంటే మందుబాబులు వీరంగం చేస్తుంటారు. యువత గంజాయి మత్తులో ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతర ఆసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. యువత బాగా మద్యం సేవించి గంజాయి మత్తులో రాత్రిపూట తమ ద్విచక్ర వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ ఖాళీ స్థలాల్లో ఉన్న మోటార్లను వైర్లు ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న వస్తువులను దొంగతనం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టిస్తున్నారు.

సాయంత్రం‌ ఆరు గంటలు దాటితే జగనన్న కాలనీలోని వీధుల్లో వైపు మహిళలు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చంద్రగిరి మండలంలో జగనన్న కాలనీ శివారు ప్రాంతం కావడంతో పెద్దగా పోలీసులు ఈ కాలనీ వైపు రాత్రిపూట గస్తీకి రాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువయ్యాయి.

యువత పెడ దోవలో పయనిస్తుంది. ప్రజలు మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించి చంద్రగిరి పోలీసులు జగనన్న కాలనీ పై ప్రత్యేక దృష్టి సాధించి అసాంఘిక కార్యక్రమాలను అణచివేయాలని స్థానిక ప్రజలు మహిళలు కోరుచున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI