Renigunta: రేణిగుంట నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Renigunta: రేణిగుంట నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!
Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. పిచ్చాటూరు గ్రామానికి చెందిన విద్యార్థి కళాశాలలో ఎం.పి.సి. గ్రూప్ మొదటి సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థిని అమర హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.




