Sullurpeta: హెచ్‌ఎమ్‌టీవీ ఇంపాక్ట్: కొన్నేంబట్టులో తీరిన నీటి కష్టాలు
Sullurpeta: హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి తక్షణ స్పందన: సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆదేశాలతో కొన్నేంబట్టులో 3 గంటల్లోనే తాగునీటి సరఫరా పునరుద్ధరణ.
Sullurpeta: హెచ్‌ఎమ్‌టీవీ ఇంపాక్ట్: కొన్నేంబట్టులో తీరిన నీటి కష్టాలు
సూళ్ళూరుపేట: ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి మరోసారి భారీ స్పందన లభించింది. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టు గ్రామంలో గత నాలుగు రోజులుగా తాగునీరు అందక, వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ హెచ్‌ఎమ్‌టీవీ వెబ్‌సైట్ కథనం తీవ్ర సంచలనం సృష్టించింది.
3 గంటల్లోనే పరిష్కారం:
ఈ కథనంపై సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తక్షణమే స్పందించారు. గ్రామస్తుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, వెంటనే సమస్యను పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సూళ్ళూరుపేట ఎంపీడీవో వై.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి వెంటనే కొన్నేంబట్టు గ్రామానికి చేరుకున్నారు.
నీటి సరఫరా ఆగిపోవడానికి గల సాంకేతిక లోపాలను గుర్తించి, యుద్ధపాతిపదికన మరమ్మతులు చేపట్టి కథనం వచ్చిన కేవలం 3 గంటల వ్యవధిలోనే గ్రామానికి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. అంతేకాకుండా, అంధకారంలో ఉన్న వీధులను పరిశీలించిన ఎంపీడీవో, వెంటనే కొత్త వీధిలైట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
హెచ్‌ఎమ్‌టీవీకి గ్రామస్తుల కృతజ్ఞతలు:
నాలుగు రోజులుగా తమ వైపు ఎవరూ చూడలేదని, తమ బాధలను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన హెచ్‌ఎమ్‌టీవీకి కొన్నేంబట్టు గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వార్త వచ్చిన వెంటనే స్పందించి తాగునీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి, ఎంపీడీవో వెంకటేశ్వరరావులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.




