Tirupati: శ్రీ పద్మావతి అమ్మవారికి రెండు గొడుగుల వితరణ!

Tirupati: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడు నుంచి తెచ్చిన పవిత్ర గొడుగుల్లో రెండింటిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 18 Sept 2026 12:10 PM IST
Tirupati
X

Tirupati: శ్రీ పద్మావతి అమ్మవారికి రెండు గొడుగుల వితరణ!

Tirupati: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడు వాహన సేవలో స్వామివారికి అలంకరించడం కోసం తమిళనాడుకు చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ తరఫున 11 గొడుగులతో పాదయాత్ర మొదలైంది. అందులో 2 గొడుగులను గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు.

ఈనెల 13వ తారీఖున ఆదివారం తమిళనాడు ప్యారిస్ లోని దేవరాజ మొదలియార్ వీధిలో ఉన్న చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో వేకువ జామున ఈ పవిత్ర గొడుగులకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం. కర్ణాటక రాష్ట్రం, తీర్థహళ్లి భీమన్న ఘడే మఠం పీఠాధిపతి రాఘవేంద్ర తీర్థ స్వామి హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్ గోపాల్‌జీ తో కలిసి జెండా ఊపి ఈ గొడుగుల పాదయాత్ర ఊరేగింపును ప్రారంభించారు.

ఐదు రోజులపాటు జరిగిన ఈ గొడుగుల పాదయాత్రలో దాదాపు 15 లక్షల మంది నుండి 20 లక్షల మంది వరకు భక్తులు పాల్గొన్నారు. ఈ గొడుగుల పాదయాత్ర గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది ఆలయం మహద్వారం వీరిని ఆలయ ఏఈఓ దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, సాదరంగా స్వాగతించారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్ గోపాల్‌జీ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో గరుడ సేవకు తమిళనాడు భక్తుల తరఫున 11 అద్భుతమైన గొడుగులను సమర్పించడం వస్తుందని అన్నారు. అందులో రెండు గొడుగులను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించిన అనంతరం మిగిలిన 9 గొడుగులను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు అలంకరించడంకోసం కోసం సమర్పిస్తున్నామని తెలిపారు. గత రెండు వందల సంవత్సరాల వరకు కొనసాగిన ఈ సాంప్రదాయం 2000 సంవత్సరంలో ఆగిపోయిందని అటు తరువాత టీటీడీ అనుమతి తీసుకుని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టు తరపున గత 22 ఏళ్లుగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వస్తురూపంగా గాని ధన రూపంగం గానీ ఎటువంటి విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL