Renigunta: రేణిగుంటలో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. వర్షం రావడంతో వివాదం సద్దుమణిగింది.
Renigunta: రేణిగుంటలో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత!
రేణిగుంట: మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల సమర్పణ సమయంలో వైసీపీ, కూటమి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప తోపులాటకు దారితీసింది. పరస్పర విమర్శలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నామినేషన్ దాఖలు చేయలేకపోయినట్లు సమాచారం. ఇంతలో వర్షం కురవడంతో వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.




