Renigunta: రేణిగుంట స్టేషన్‌లో టికెట్ గొడవ ప్రయాణికుడి హైడ్రామా!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడి హైటెన్షన్ డ్రామా. జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీ ఎక్కడంతో టికెట్ కలెక్టర్ దించేశాడని ఆత్మహత్యాయత్నం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 Sept 2026 11:32 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట స్టేషన్‌లో టికెట్ గొడవ ప్రయాణికుడి హైడ్రామా!

Renigunta: సాధారణ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని టికెట్ కలెక్టర్ రేణిగుంట రైల్వే స్టేషన్‌లో దించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆ వ్యక్తిని రైల్వే అధికారులు దించిన అనంతరం, తన సమస్యపై రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందన లభించలేదని భావించినట్లు సమాచారం.

దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రయాణికుడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి హై వోల్టేజ్ విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.గంటల తరబడి రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందికి గురయ్యారు.

సమాచారం అందుకున్న GRP, RPF, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రయాణికుడిని కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు సిబ్బంది సమన్వయంతో అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

సాధారణ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణించడంతో మొదలైన వ్యవహారం.. చివరకు రైల్వే ఫ్లైఓవర్‌పై హైటెన్షన్ హైడ్రామాకు దారితీయడంతో రేణిగుంట రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA