Renigunta: రేణిగుంట ఏఎన్‌ఆర్ కాలనీలో జలదిగ్బంధం ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట తూకివాకం పంచాయతీ ఏఎన్‌ఆర్ కాలనీలోకి వర్షపు నీరు చేరింది. రైల్వే పనుల వల్ల నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Renigunta: రేణిగుంట ఏఎన్‌ఆర్ కాలనీలో జలదిగ్బంధం ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలోని ఏఎన్ఆర్ కాలనీ వాసులు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరి ఇళ్లలోకి ప్రవేశించింది.
రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో వర్షపు నీరు వెళ్లే వంతెనను మూసివేయడంతో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి...
కాలనీలో నిలిచిపోయిన వర్షపు నీటిని తక్షణమే తొలగించి, నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




