Renigunta: రేణిగుంట మండలంలో పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

Renigunta: రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు మంగళవారం నాటికి మొత్తం 952 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 296, వార్డు సభ్యులకు 656 నామినేషన్లు వచ్చాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 Nov 2026 8:11 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

రేణిగుంట: గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రేణిగుంట మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొత్తం 952 నామినేషన్లు దాఖలైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్ల వివరాల ప్రకారం సర్పంచ్ స్థానాలకు 296 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 656 నామినేషన్లు కలిపి మొత్తం 952 నామినేషన్లు నమోదయ్యాయి.

మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా పరిశీలిస్తే రేణిగుంట పంచాయతీ అత్యధికంగా 157 నామినేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో సర్పంచ్ స్థానానికి 17, వార్డు సభ్యుల స్థానాలకు 140 నామినేషన్లు వచ్చాయి. కరకంబాడి పంచాయతీ 121 నామినేషన్లతో రెండో స్థానంలో ఉండగా, తూకివాకం 81, జీపాలెం 74, ఎల్లమండ్యం 64 నామినేషన్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మిగిలిన గ్రామ పంచాయతీల్లోనూ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న రోజుల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA