Gudur: గూడూరు తాళ్లమ్మ ఆలయంలో విశేష పూజలు!

Gudur: గూడూరు గ్రామదేవత శ్రీశ్రీ తాళ్లమ్మ ఆలయంలో వైభవంగా విశేష పూజలు: భక్తుల భారీ రద్దీ, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 7:22 PM IST
Gudur
X

Gudur: గూడూరు తాళ్లమ్మ ఆలయంలో విశేష పూజలు!

గూడూరు: గూడూరు పట్టణ శివారులో వెలసిన గ్రామదేవత శ్రీశ్రీ తాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణం, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, ఉషారాణి కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించి ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలను శ్రీశ్రీ తాళమ్మ దేవస్థాన అభివృద్ధి కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్