Tiruchanur: గజవాహనంపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా ఆదివారం రాత్రి అమ్మవారు గజవాహనంపై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
Tiruchanur: గజవాహనంపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఆదివారం రాత్రి గజవాహనం పై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖ్యమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు.
అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవిఎస్వో శ్రీహరిరావు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబు స్వామి, విఐ రామ్మోహన్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీపతి, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.




