Renigunta: రేణిగుంటలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తతో తలెత్తుతున్న పారిశుధ్య సమస్య!

Renigunta: రేణిగుంటలో చెత్త సేకరించే బండ్లలోనే వ్యర్థాలు వేయాలని అధికారుల సూచన. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని పంచాయతీ విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Oct 2026 2:59 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తతో తలెత్తుతున్న పారిశుధ్య సమస్య!

రేణిగుంట: పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుండటంతో పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరు రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తుండటంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇంటి వద్దకు చెత్త సేకరణ బండి వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను అందులోనే వేయాలని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా దుర్వాసన, దోమలు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం పంచాయతీ అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించాలని సూచిస్తున్నారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, చెత్త సేకరణ బండి వచ్చినప్పుడు అందులోనే వేస్తూ రేణిగుంటను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA