Gajulamandyam: గాజులమండ్యం: ఆటో ప్రయాణికుడిపై దాడి, దోపిడీ ముఠా అరెస్ట్
Gajulamandyam: తిరుపతి సమీపంలోని తూకివాకం వద్ద ఆటో ప్రయాణికుడిపై దాడి చేసి నగదు, ఫోన్ దోచుకున్న ముగ్గురు నిందితులను గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేశారు.
Gajulamandyam: గాజులమండ్యం: ఆటో ప్రయాణికుడిపై దాడి, దోపిడీ ముఠా అరెస్ట్
తిరుపతి జిల్లా, గాజులమండ్యం: ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని అడ్డగించి దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ దోపిడీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 26న దామినేడు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 24న రాత్రి తిరుపతి నుంచి పుత్తూరు వైపు వెళ్తున్న వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని, తూకివాకం చెరువు సమీపంలోని చీకటి ప్రాంతంలో ఆటోను నిలిపి దాడి చేసి రూ.500 నగదు, సుమారు రూ.10 వేల విలువైన VIVO మొబైల్‌ను దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో *ఎస్. జయకుమార్ @ స్వామి (43), జరుపాల్ హన్మంతు @ తెలుగు రవి (27), సుంకర మోహిత్ సాయి (21)*లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు Bajaj Maxima ఆటోలు, VIVO Y28 5G మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితుల్లో జయకుమార్‌పై 12, హన్మంతుపై 12, మోహిత్ సాయిపై 2 పాత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాజులమండ్యం PSలో Cr.No.135/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.




