Naidupet: నాయుడుపేటలో ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీకాలం సత్కరించిన సంజీవయ్య!
Naidupet: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఘనంగా సత్కరించారు.
Naidupet: నాయుడుపేటలో ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీకాలం సత్కరించిన సంజీవయ్య!
Naidupet: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఎంపీపీ జడ్పిటిసి ఎంపీటీసీల పదవీకాలం ముగింపు కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల అధ్యక్షులు ఓట్టూరు కిషోర్ యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు,
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 5 సంవత్సరాలు పదవి కాలం లో భాగంగా ప్రజాసేవ చేసి వారి వారి సంబంధిత ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్న వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన నాయకులుగా ముందుండి సామాన్య ప్రజలకు భరోసాని కల్పిస్తూ తమ పదవీకాలంలో ప్రజల మన్ననాలు పొందిన నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, మరియు ఎంపీటీసీలు కు తాను అభినందనలు తెలియజేస్తున్నానని వారికి నిర్వర్తించిన కర్తవ్యాలను 5 సంవత్సరాలుగా ఇటువంటి లోటపాటులు లేకుండా నాయుడుపేట ప్రజలు అభినందించే విధంగా పరిపాలనను కొనసాగించిన ఈ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సభ్యులు ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ కార్యక్రమాలను దగ్గరుండి అందజేసిన విధానం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలియపరిచారు.




