Tirupati: డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారం అవాస్తవం: రవాణా శాఖ
Tirupati: సెప్టెంబర్ 25లోపు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం అవాస్తవమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి స్పష్టం చేశారు.
Tirupati: డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారం అవాస్తవం: రవాణా శాఖ
తిరుపతి: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25లోపు అప్‌డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రవాణా శాఖ సేవలు, చలానాలు, రెన్యువల్ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ప్రయోజనకరమని తెలిపారు.
ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా, రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని వాహనదారులకు సూచించారు.
జిల్లా రవాణా శాఖ అధికారి
తిరుపతి




