Renigunta: రేణిగుంటలో కత్తితో వ్యక్తి హల్‌చల్: కేసు నమోదు

Renigunta: రేణిగుంటలో ఎంపీటీసీ నామినేషన్ల బందోబస్తు వేళ మద్యం మత్తులో కత్తితో హల్‌చల్ చేస్తూ ప్రజలను భయపెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 Oct 2026 6:54 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో కత్తితో వ్యక్తి హల్‌చల్: కేసు నమోదు

రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట పట్టణంలో ఎం.పీ.టి.సీ. నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేసిన ఘటన కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు బుగ్గ వీధిలోని మంచినీటి గుంట వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. యల్లమాండ్యం హరిజనవాడకు చెందిన శేషాద్రి అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి పట్టుకుని తిరుగుతూ, రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఘటనపై రేణిగుంట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ప్రవర్తించవద్దని పోలీసులు సూచించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA