Tirupati: గాజులమండ్యం సర్కిల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడిన కాటన్ లారీ!
Tirupati: తిరుపతి జిల్లా గాజులమండ్యం సర్కిల్ వద్ద మద్యం మత్తులో లారీ డ్రైవర్ టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి లారీ బోల్తా పడింది.
Tirupati: గాజులమండ్యం సర్కిల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడిన కాటన్ లారీ!
Tirupati: శ్రీకాళహస్తి వైపు నుంచి వస్తున్న కాటన్ లారీ గాజులమండ్యం పరిధిలో ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి చెందిన టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం.
ఈ ఘటనలో టాటా ఏస్ వాహనానికి చుట్టూ ఏర్పాటు చేసిన బ్యానర్లు చిరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న గాజులమండ్యం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు,ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.




