Renigunta: కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని డిమాండ్!

Renigunta: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలంటూ రేణిగుంటలో సీఐటీయూ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Nov 2026 5:51 PM IST
Renigunta
X

Renigunta: కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని డిమాండ్!

Renigunta: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తారకరామా నగర్‌లో చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రేణిగుంట సీఐటీయూ మండల కన్వీనర్ కాంజేరి సెల్వరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల శ్రమను దోచుకుంటూ, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, కార్మికుల హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులంతా ఢిల్లీకి చేరుకుని కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఓ. వెంకటరమణ, తారకరామా నగర్ సీపీఎం శాఖ కార్యదర్శి సత్య, ఆటో యూనియన్ నాయకులు దీప, మహిళా సంఘం నాయకురాలు కుమారి, తారకరామా నగర్ అభివృద్ధి సంఘం నాయకులు శివానందం, కిషోర్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA