Srikalahasti: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం!

Srikalahasti: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 17 Sept 2026 12:56 PM IST
Srikalahasti
X

Srikalahasti: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం!

Srikalahasti: రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 3,613 వార్డుల్లో విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 34.24 శాతం ఓట్ల వాటా లభించింది.

ఈ సందర్భంగా DCC అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి గణనీయమైన మద్దతు లభించిందన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ కొనసాగుతోందని సూచిస్తున్నాయని తెలిపారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు ప్రజల మద్దతుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి 34.24 శాతం ఓట్లు రావడం ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందనడానికి సూచికగా పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమసుందరం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI