Tirupati: సోషల్ మీడియా ప్రచారానికి ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి!

Tirupati: తిరుపతి స్థానిక సంస్థల ఎన్నికల వేళ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Oct 2026 11:07 AM IST
Tirupati
X

Tirupati: సోషల్ మీడియా ప్రచారానికి ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో నిర్వహించే ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచార పోస్టులు, వీడియోలు రూపొందించినా, కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచార అంశాలను ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం పరిశీలిస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థుల తరఫున నిర్వహించే చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులకు సంబంధించిన ఖర్చులను ఎన్నికల వ్యయంలో నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఎన్నికల ప్రచార ప్రకటనలు, వీడియోలను ప్రచురించే ముందు నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించి, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA