Renigunta: శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెరిమనీ.. హాజరైన కలెక్టర్!
Renigunta: రేణిగుంట శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల వైట్ కోట్ సెరిమనీలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొని నైతిక విలువలతో సేవలందించాలని సూచించారు.
Renigunta: శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెరిమనీ.. హాజరైన కలెక్టర్!
Renigunta: వైద్య వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని, వైద్య విద్యార్థులు రోగి సంక్షేమం, వైద్య నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు.
గురువారం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థుల ఓరియంటేషన్, వైట్ కోట్ సెరిమనీ, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా, విషయ పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వైద్య సేవల్లో రోగుల పట్ల శ్రద్ధ, బాధ్యత, మానవతా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. రాబోయే ఆరు సంవత్సరాల వైద్య విద్యను ఒత్తిడి లేకుండా ఆనందంగా అభ్యసిస్తూ, మంచి వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.




