Tirupati: ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!
Tirupati: తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పరిశీలించారు.
Tirupati: ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!
Tirupati: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ ప్రక్రియను, అధికారుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




