Chandragiri: 'పేరడైజ్' అద్భుతం: స్టూడెంట్స్‌తో మోహన్ బాబు సందడి
Chandragiri: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్‌లో 'పేరడైజ్' సినిమాను చూసిన కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు.
Chandragiri: 'పేరడైజ్' అద్భుతం: స్టూడెంట్స్‌తో మోహన్ బాబు సందడి
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం చంద్రగిరిలోని ఎస్.వి సినిమా హాల్ ఆదివారం సాయంత్రం సినీ ఉత్సాహంతో, విద్యార్థుల కేరింతలతో హోరెత్తిపోయింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు విద్యార్థులతో కలిసి ఆదివారం సాయంత్రం 'పేరడైజ్' చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు.
థియేటర్‌కు విచ్చేసిన మోహన్ బాబు గారికి విద్యార్థులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమా నిర్మాణం, కథనం అత్యంత అద్భుతంగా వచ్చాయని కొనియాడారు.
విద్యార్థుల మధ్య కూర్చొని సినిమా చూడటం ఒక తీపి జ్ఞాపకమని, చిత్రం చూస్తున్నంత సేపు వారి నుండి వచ్చిన స్పందన, ఉత్సాహమే సినిమా విజయానికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా యువత నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల సినీ ప్రస్థానంలో ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తనను నిరంతరం నడిపిస్తున్నాయని ఈ సందర్భంగా మోహన్ బాబు వ్యాఖ్యానించారు.




