Naidupeta: స్థానిక ఎన్నికల వేళ నాయుడుపేట సీఐగా ముక్కుసూటి అధికారి వెంకటరమణ!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ సీఐగా ముక్కుసూటి పోలీస్ అధికారి టి. వెంకటరమణ (గబ్బర్ సింగ్) బాధ్యతలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2026 10:33 PM IST
Naidupeta
X

Naidupeta: స్థానిక ఎన్నికల వేళ నాయుడుపేట సీఐగా ముక్కుసూటి అధికారి వెంకటరమణ!

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా టి. వెంకటరమణ (గబ్బర్ సింగ్) బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇప్పటివరకు నాయుడుపేట అర్బన్ సీఐగా ఉన్న వెంకటేశ్వర్లు విఆర్ కు తరలించారు, ఆయన స్థానంలో టీ వెంకటరమణ బాధ్యతలు చేపట్టడం జరిగింది, స్థానిక ఎన్నికల సమయంలో టి .వెంకటరమణ ( గబ్బర్ సింగ్) లాంటి నీతి నిజాయితీగల ముక్కుసూటితనంతో ఉండే వ్యక్తి నీ నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా తీసుకురావడం నాయుడుపేటలో చర్చనీయాంశంగా మారింది,

టి .వెంకటరమణ గతంలో నాయుడుపేట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేయడం జరిగింది, ప్రజలలో అపారమైన నమ్మకం కలిగిన పోలీసు అధికారిగా టి వెంకటరమణ(గబ్బర్ సింగ్) కు ఎనలేని పేరు ప్రతిష్టలు ఉండడం మరియు గతంలో నాయుడుపేట పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనుభవం కలిగి ఉండడం స్థానిక ఎన్నికలవేళ ప్రజలలో ఆయన బాధ్యతలు తీసుకోవడం హర్షించదగిన విషయంగా పరిగణించవచ్చు. నాయుడుపేటలో స్థానిక ఎన్నికల సమయంలో టి. వెంకటరమణ (గబ్బర్ సింగ్) బాధ్యతలు చేపట్టడం ప్రజల స్వేచ్ఛ పరమైన ఓటు హక్కు వినియోగానికి శుభ పరిమాణంగా పరిగణిస్తున్న రాజకీయ విశ్లేషకులు అని ప్రజలు మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్