Srikalahasti: శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలల దినోత్సవం!

Srikalahasti: శ్రీకాళహస్తి భాస్కర్‌పేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 14 Nov 2026 4:39 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలల దినోత్సవం!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్‌పేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, స్కౌటింగ్ వ్యవస్థాపకుడు లార్డ్ బాడెన్ పావెల్ చిత్రపటాలకు రోవర్ స్కౌట్ లీడర్, స్కౌట్ మాస్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో వేర్వేరుగా ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థగా రూపుదిద్దుకోవడంలో నెహ్రూ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోవర్ స్కౌట్ లీడర్ టి. రమేష్ బాబు, స్కౌట్ మాస్టర్లు జి. విజయ్ కుమార్, షేక్ అజారుద్దీన్, పాఠశాల స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI