Tirupati: చంద్రగిరి నియోజకవర్గంలో రేపే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!
Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది.
Tirupati: చంద్రగిరి నియోజకవర్గంలో రేపే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్!
Tirupati: చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయగా, గ్రామీణ ఓటర్లు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు, స్థానిక మేధావులు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత పెరిగినా లేదా అకాల వర్షం కురిసినా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరే సాధారణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే ఉదయపు వేళల్లో పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు వేసి, ఆ తర్వాత ఇతర పనులను చూసుకోవడం మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు పండుగ వాతావరణంలో ఎన్నికలు రావడంపై పల్లెల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఎన్నికల కోడ్ ఆంక్షలు, నిఘా నీడలు, నాయకుల ఆర్భాటాలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అయితే తెరవెనుక రాజకీయ సమీకరణాలు, పండుగ ఖర్చుల పేరుతో అభ్యర్థుల నుంచి చేరిన "నజరానాలు" ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనే వ్యంగ్యాస్త్రాలు కూడా క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, రాజకీయ ప్రలోభాలు, పండుగ సందళ్ల నడుమ సామాన్య ఓటరు తన అంతిమ తీర్పుతో ఎవరికి పట్టం కడతాడన్నది ఆసక్తికరంగా మారింది.




