Tiruchanur: తిరుచానూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Tiruchanur: తిరుపతి జిల్లా తిరుచానూరు మేజర్ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రచార హోరు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి రంగనాథం వీధిలో ఇంటింటి విస్తృత ప్రచారం.
Tiruchanur: తిరుచానూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Tiruchanur: తిరుచానూరు మేజర్ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో రంగనాథం వీధిలో కూటమి శ్రేణులు ఉత్సాహంగా కదం తొక్కుతున్నాయి. తిరుచానూరు రంగనాథంవీధి పరిధిలో ఎన్నికల బరిలో నిలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తిరుచానూరు రంగనాథ వీధిలో కూటమి ప్రచార భేరి హోరెత్తింది. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి స్వయంగా ప్రతి ఇంటి గడప తొక్కుతూ, ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ టిడిపి (మండల) పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సి మధు, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు వి. కిషోర్ రెడ్డి, ఎంపీటీసీ శంకర్ రెడ్డి, వాసు, హరి రామ్ రెడ్డి, దామ సాయి రాయల్, సురేష్, సల్మాన్ రాజు, జీవన్ కుమార్, జానీ, పూర్ణచంద్ర, శ్రీధర్ రెడ్డి, ఏకాంబరం కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




