Tirupati: తిరుపతిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ముగింపు ప్రచారం
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచార తుది ఘట్టంలో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ల తరఫున చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముమ్మర ప్రచారం చేశారు.
Tirupati: తిరుపతిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ముగింపు ప్రచారం
తిరుపతి: తిరుపతి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు చివరి ఘట్టంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యులు, కార్పొరేటర్ల, సహాచర ఎమ్మెల్యేతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు. ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ, స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన నేతలు.
కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌తో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.




