Chandragiri: మోహన్ బాబు విశ్వవిద్యాలయం తొలి పీహెచ్‌డీని అందుకున్న గిరీశ్ కుమార్!

Chandragiri: చంద్రగిరి మోహన్ బాబు విశ్వవిద్యాలయం మొదటి పిహెచ్‌డిని కుప్పిరెడ్డి గిరీశ్ కుమార్‌కు అందజేత. రీట్రాక్టబుల్ నీడిల్ సేఫ్టీ సిరింజ్ ఆవిష్కరణ.

K VENU, TIRUPATHI RURAL
Published on: 27 Oct 2026 5:57 PM IST
Chandragiri
X

Chandragiri: మోహన్ బాబు విశ్వవిద్యాలయం తొలి పీహెచ్‌డీని అందుకున్న గిరీశ్ కుమార్!

Chandragiri: చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం 2022లో యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. తన మొట్టమొదటి పి.హెచ్.డి'ని స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ పీ.హెచ్‌.డీ స్కాలర్ కుప్పిరెడ్డి గిరీశ్ కుమార్ అక్టోబర్ 26, 2026న రిజిస్ట్రార్ డా. కే. సారథి పర్యవేక్షణలో తన రీసెర్చ్ ను పూర్తి చేసి ఓపెన్ డిఫెన్స్ విజయవంతంగా పూర్తి చేశారు.

రక్తం ద్వారా సోకే ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, నీడిల్-స్టిక్ గాయాలను నివారించడానికి, సిరింజ్ పునరుపయోగం అడ్డుకోవడానికి ఒక స్వదేశీ 'రీట్రాక్టబుల్ నీడిల్ సేఫ్టీ సిరింజ్'ను ఆవిష్కరించారు. ఈ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణకు పేటెంట్ లభించడమే కాకుండా, వాణిజ్య ఉత్పత్తి కోసం హెర్విక్ హెల్త్‌కేర్ సంస్థ లైసెన్స్ పొందింది. అకాడమిక్ పరిశోధనను ఆచరణాత్మక వైద్య నూతన ఆవిష్కరణగా మార్చిన ఈ పరిశోధన ద్వారా మొట్టమొదటి పి‌.హెచ్‌.డి'ని కుప్పిరెడ్డి గిరీష్ కుమార్ యూనివర్సిటీ అందజేస్తున్నది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల ఛాన్సలర్, పద్మశ్రీ డా. ఎం. మోహన్ బాబు, ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు, వైస్-ఛాన్సలర్ డా. వెంకటరమణ, రిజిస్ట్రార్ సారథి 'లూ రీసెర్చ్ స్కాలర్‌ను, గైడ్‌ను అభినందించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL