Srikalahasti: కార్యకర్త సంక్షేమమే టీడీపీ తొలి ప్రాధాన్యత: ఉమేష్ రావు

Srikalahasti: కార్యకర్త సంక్షేమమే టీడీపీ ప్రథమ ప్రాధాన్యతని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ఐక్యంగా శ్రమించాలని డా.యం.ఉమేష్ రావు పిలుపునిచ్చారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 7 Oct 2026 4:47 PM IST
Srikalahasti
X

Srikalahasti: కార్యకర్త సంక్షేమమే టీడీపీ తొలి ప్రాధాన్యత: ఉమేష్ రావు

శ్రీకాళహస్తి: పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కష్టసమయంలోనూ అండగా నిలిచే సాధారణ కార్యకర్త సంక్షేమమే తెలుగుదేశం పార్టీ తొలి ప్రాధాన్యత అని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు అన్నారు.

శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జి.విజయకుమార్ నాయుడు ఆధ్వర్యంలో 50, 51, 52, 53 బూత్‌ల పరిధిలోని టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమేష్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సమున్నత సంకల్పంతో ఏర్పడిన టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు. నాయకత్వం అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో పూర్తి చేస్తూ ప్రజాభిమానం పొందుతున్న టీడీపీ కార్యకర్తలు నిబద్ధతకు నిలువుటద్దమని కొనియాడారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యం

గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఉమేష్ రావు తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకవర్గాలు లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం

బీసీ నాయకత్వాన్ని చిన్నచూపు చూడటం తగదని ఉమేష్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తోందన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా టీడీపీ వెనక్కి తగ్గదని, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, పట్టణ అధ్యక్షుడు జి.విజయకుమార్ నాయుడు, సీనియర్ నాయకులు కంటా రమేష్, లక్కమనేని మధుబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, గాదిపాకుల గోపీనాథ్, వజ్రం కిషోర్, డి.వి.నారాయణ, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్ రాయల్, తుపాకుల ప్రసాద్, గంగనపల్లి రమేష్, పూల శేఖర్, పసుపులేటి శంకరయ్య, షేక్ అమీర్, శంకర్, షేక్ ఖాదర్, శివ ఆచారి, కె.సుబ్రహ్మణ్యం, విజయ, సాయి భార్గవ్, మహ్మద్ రఫీ, చిల్లకూరు మణి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI