Srikalahasti: పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ
Srikalahasti: పూతలపట్టు పంచాయతీ ఎన్నికల పరిశీలకుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్‌తో కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చ.
Srikalahasti: పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల పరిశీలకుడిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
ఇందులో భాగంగా శుక్రవారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె. మురళీమోహన్‌ను సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలాబలాలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం.




