Renigunta: రేణిగుంటలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళులు!

Renigunta: రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Sept 2026 5:10 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళులు!

రేణిగుంట: భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త, మహోన్నత దేశభక్తుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా రేణిగుంట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వన్నెకుల రాష్ట్ర అధ్యక్షురాలు తేజోవతి మాట్లాడుతూ.. సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమమే లక్ష్యంగా ‘అంత్యోదయ’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సేవలు, ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఏకాత్మ మానవతావాదం ద్వారా జాతి నిర్మాణానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్ రెడ్డి, వన్నెకుల రాష్ట్ర అధ్యక్షురాలు తేజోవతి, చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేష్, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా మాజీ కోశాధికారి పీఆర్‌జీ శ్యామ్, మండల ఉపాధ్యక్షుడు హరీష్, రాజా, అశోక్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్. వేణుగోపాల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఆనంద్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కేశవాలు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA