Srikalahasti: శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియామకం
Srikalahasti: శ్రీకాళహస్తి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావనిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియామకం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి సబ్ డివిజన్ డీఎస్పీగా బి. పావని నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం డీఎస్పీగా వెయిటింగ్‌లో ఉన్న బి. పావనిని శ్రీకాళహస్తిలో ఖాళీగా ఉన్న డీఎస్పీ పోస్టులో తక్షణమే నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకుముందు ఆమెకు విజయవాడ ఎన్‌టీఆర్ పోలీసు కమిషనరేట్ దక్షిణ విభాగం ఏసీపీగా ఇచ్చిన పోస్టింగ్‌ను రద్దు చేశారు.
ఇటీవల శ్రీకాళహస్తి డీఎస్పీగా పనిచేసిన కె. నరసింహమూర్తి గూడూరుకు బదిలీ కావడంతో డీఎస్పీ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బి. పావని నియామకం జరిగింది.




